Sunday, 20 September 2020

ఒక్క SMSతో దర్జాగా debit/Credit కార్డ్ ఎలా దొంగిలిస్తున్నారో ఇక్కడ చూడండి!


ఈరోజు మధ్యాహ్నం GetPrizefromInstagram పేరిట నాకు ఓ SMS లింక్ వచ్చింది. ఆ లింక్ వెనుక ఎలాంటి ఫ్రాడ్ ఉండే మీడియా ద్వారా అవగాహన కల్పించే ఉద్దేశంతో దాన్ని ఓపెన్ చేసి దశలవారీగా ఏం జరుగుతుందో స్క్రీన్ షాట్స్ తీశాను. ఇప్పుడు చాలామంది ఈ లింక్ సర్క్యులేట్ అవుతోంది కాబట్టి దీని వెనక ఎలాంటి ఫ్రాడ్ ఉందో మీరూ తెలుసుకుని అప్రమత్తంగా ఉండండి.

ఈ లింకు క్లిక్ చేసినప్పుడు మొట్టమొదట స్క్రీన్ మీద చూపించే కొన్ని గిఫ్ట్ బాక్స్‌లు ఓపెన్ చెయ్యమని సూచిస్తుంది. వాటిని మీరు ఓపెన్ చేసిన తర్వాత, మీరు ఫలానా మొత్తంలో డబ్బులు గెలుచుకున్నారు అని స్క్రీన్ మీద మెసేజ్ వచ్చి, దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి క్రింది బటన్ క్లిక్ చేయమని అడుగుతుంది. ఆ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఒక అమ్మాయి బొమ్మతో ఛాట్ బోట్ వస్తుంది. అదంతా కూడా ఒకదాని తర్వాత ఒకటి ఆటోమేటిక్గా మెసేజ్లు టైప్ అయ్యే యానిమేషన్ మాత్రమే. నిజమైన ఛాట్ కాదు. ఆ తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ టైప్ చేయమని ఒక బాక్స్ వస్తుంది.

ఆ బాక్స్ లో అకౌంట్ నెంబర్ టైప్ చేసిన తర్వాత, సర్వర్‌కి కనెక్ట్ అవుతోంది అంటూ ఒక స్క్రీన్ వచ్చి.. ఆ తర్వాత సర్వర్ కనెక్టివిటీ రిజెక్ట్ అయింది అంటూ.. వెరిఫికేషన్ అమౌంట్ చెల్లించి గిఫ్ట్‌గా గెలుచుకున్న డబ్బులు సొంతం చేసుకోండి అంటూ.. స్క్రీన్ మీద Credit మరియు Debit card వివరాలు టైప్ చేసే విధంగా ఒక నకిలీ స్క్రీన్ వస్తుంది.

పొరపాటున ఇక్కడ మీరు మీ కార్డు వివరాలు ఎంటర్ చేశారంటే మీ బ్యాంక్ అకౌంట్ పూర్తిగా ఖాళీ అయిపోతుంది. కాబట్టి ఇలాంటి ప్రమాదకరమైన SMSలు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండండి.










,

No comments:

Post a comment