Thursday, 16 April 2020

మీరు Zoom వాడుతుంటే, మీ అకౌంట్ హ్యాక్ కాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి!

క్రెడెన్షియల్ స్టఫింగ్ అనే టెక్నిక్ ఉపయోగించి ప్రపంచ వ్యాప్తంగా భారీ మొత్తంలో Zoom video conferencing అప్లికేషన్ యూజర్నేమ్ పాస్వర్డ్లను హ్యాకర్లు డార్క్ వెబ్‌లో అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే. 
ఈ నేపథ్యంలో Zoom అప్లికేషన్ వాడుతున్నవారు ఆందోళనలో ఉన్నారు. కొన్ని టెక్నిక్స్ ఫాలో అవడం ద్వారా మీ జూమ్ ఎకౌంట్ సురక్షితంగా ఉండే విధంగా కాపాడుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు చూద్దాం.
5 లక్షలకు పైగా జూమ్ అకౌంట్ పాస్వర్డ్‌లు డార్క్ వెబ్‌లో చాలా చవకగా అమ్మకానికి పెట్టబడ్డాయి. ఈ నేపథ్యంలో వాటిలో మీ అకౌంట్ ఉందో లేదో తెలుసుకునే అవకాశం నేరుగా లేదు కాబట్టి, ఆలస్యం చేయకుండా మీరు మీ జూమ్ అకౌంట్ పాస్వర్డ్ మార్చుకోండి. ఎవరూ ఊహించని బలమైన password సెట్ చేసుకోండి. ఇటీవల Zoom డిఫాల్ట్గా పాస్వర్డ్లను ఉపయోగించే ఆప్షన్ తీసుకువచ్చింది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో డిజేబుల్ చేయకండి.
మీరు నిర్వహిస్తున్న జూమ్ మీటింగ్‌లో మీ ప్రమేయం లేకుండా ఎవరైనా అనుమానితులు ఎంటర్ అయినట్లయితే, కచ్చితంగా మీ Zoom Account ఎకౌంట్ కాంప్రమైజ్ ఉన్నట్లు భావించాలి. అలాంటప్పుడు పాస్వర్డ్ మార్చుకోవడమే పరిష్కారం. ఏదైనా మీటింగ్ నిర్వహిస్తున్నప్పుడు స్క్రీన్ షేరింగ్ కేవలం మీటింగ్ నిర్వహిస్తున్న వ్యక్తి మాత్రమే ఎనేబుల్ చేసే విధంగా సెట్ చేసుకోండి.

లేదంటే మీ ప్రమేయం లేకుండా మీరు నిర్వహిస్తున్న మీటింగ్ లోకి ప్రవేశించిన ఇతర వ్యక్తులు screen sharing సదుపాయాన్ని ఎనేబుల్ చేసి, మీటింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్న ఇతర యూజర్లకు ప్రమాదకరమైన కంటెంట్ చూపించే అవకాశం ఉంది. అలాగే ఛాట్ బాక్స్ లో ఎవరైనా ప్రమాదకరమైన లింకులు షేర్ చేస్తున్నారేమో నిశితంగా పరిశీలిస్తూ ఉండండి. జూమ్ సెట్టింగ్స్ లో ఉండే join before host అనే ఆప్షన్ డిజేబుల్ చేయండి. దాంతోపాటు allow removed participants to rejoin అనే సదుపాయాన్ని కూడా డిజేబుల్ చేయండి. ఎవరినైనా మీరు స్వయంగా తొలగించినపుడు, వారు మళ్ళీ వెనక్కి తిరిగి రాకుండా ఈ ఆప్షన్ డిజేబుల్ చేయటం మంచిది.

అన్నిటికంటే ప్రధానంగా Zoom అప్లికేషన్ ద్వారా ట్రాఫిక్ చైనా సర్వర్ల నుండి రూట్ చెయ్యబడుతోంది అనే సందేహాలు ఉన్నాయి కాబట్టి, వీలైనంతవరకు VPN కనెక్షన్ ఉపయోగించటం ద్వారా, డేటా ఎన్క్రిప్ట్ అయ్యేవిధంగా ఏర్పాటు చేసుకోండి.
,

No comments:

Post a comment

Here Is A Quick Guide For You To Remove Shortcut Virus

The most common problem that many of us get to experience in common all the time is the  shortcut virus . When we find our files, folders tu...