Sunday, 19 April 2020

Windows 10 వాడుతున్న వారికి ఒక అద్భుతమైన సదుపాయం వస్తోంది!

Windows 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే laptop లేదా PC వాడుతున్న వినియోగదారుల కోసం మైక్రోసాఫ్ట్ సంస్థ ఒక అద్భుతమైన సదుపాయం అందుబాటులోకి తీసుకొస్తోంది.
Windows ఆపరేటింగ్ సిస్టం లో ఏదైనా ప్రోగ్రాం, లేదా ఫైల్ వెతికి పట్టుకోవాలంటే ఖచ్చితంగా start మెనూలో కష్టపడి వెతకటం గానీ, లేదా ముఖ్యమైన అప్లికేషన్లకు డెస్క్టాప్ మీద షార్ట్ కట్ క్రియేట్ చేసుకోవడం గానీ చేయాల్సి ఉంటుంది. లేదా కొద్దిగా అవగాహన ఉన్నవారు Win+R కీలను ప్రెస్ చేయటం ద్వారా run డైలాగ్ బాక్స్ ఓపెన్ చేసుకుని తమకు కావాల్సిన ప్రోగ్రాం నేరుగా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు.
అయితే అంత కష్టపడాల్సిన పని లేకుండా, Apple Mac ఆపరేటింగ్ సిస్టం లో మాదిరిగా మరింత సులభంగా ప్రోగ్రాంలను ఓపెన్ చేసే సదుపాయాన్ని మైక్రోసాఫ్ట్ విండోస్ 10 యూజర్ల కోసం అతి త్వరలో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. Spotlight Launcher మాదిరిగా కనిపించే ఈ ఫీచర్‌ని కేవలం ఒకే ఒక కీబోర్డ్ షార్ట్ కట్‌తో స్క్రీన్ మీద ఎక్కడైనా తెచ్చుకోవచ్చు. అందులో ఒక్కో అక్షరం టైప్ చేసుకుంటూ వెళ్లే కొద్దీ పై చిత్రంలో కనిపిస్తున్న విధంగా ఆ పేరుతో ఉన్న ప్రోగ్రాముల జాబితా కనిపిస్తుంది. చాలా సులభంగా వాటిని ఓపెన్ చేసుకోవచ్చు.
కేవలం కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయబడిన ప్రోగ్రాములు మాత్రమే కాదు, థర్డ్-పార్టీ అప్లికేషన్ డెవలపర్ లతో కలిసి పని చేయడం ద్వారా అనేక రకాల plug-ins కూడా దీంట్లో సపోర్ట్ చేసే విధంగా మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా వివిధ అప్లికేషన్లలో ఈ లాంఛర్ ద్వారా నేరుగా పనులు పూర్తి చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంటర్నెట్లో కావాల్సిన సమాచారాన్ని ప్రస్తుతం మీరు ఏ అప్లికేషన్ లో ఉన్నా సులభంగా వెతికి పట్టుకోవచ్చు. అనేక రకాల ఇతర శక్తివంతమైన పనులు కూడా కాలక్రమంలో దీనిద్వారా సాధ్యపడతాయి. మే 2020లో మైక్రోసాఫ్ట్ సంస్థ ఈ కొత్త ఫీచర్ Beta వెర్షన్ విడుదల చేసే సన్నాహాల్లో ఉంది.

No comments:

Post a comment

A Simple Trick For Converting Any Image Into PDF In Your PC

The process of converting  images  to  PDF  files could be a difficult thing and would include a lot of efforts as well if you don’t know ...