Monday, 11 November 2019

Xiaomi phone వాడుతున్నారా? ఈ కొత్త ఫీచర్ రాబోతోంది!

మీ దగ్గర Xiaomi phone ఉందా? అయితే చాలా సందర్భాల్లో ఉపయోగపడే ఒక అద్భుతమైన సదుపాయం అతి త్వరలో మీకు రాబోతోంది.

ఇటీవలి కాలంలో స్మార్ట్ఫోన్ తయారీ సంస్థలు డిజిటల్ వెల్ బీయింగ్ ఫీచర్స్ మీద ప్రధాన దృష్టి పెడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో Xiaomi సంస్థ ఇప్పటికే మార్కెట్లో ఉన్న అన్ని ఫోన్లకు MIUI అప్డేట్ రూపంలో కొత్తగా Focus Mode అనేది అందించబోతోంది. ఇప్పటికే MIUI డెవలపర్ వెర్షన్ వాడుతున్న వారికి ఇది లభిస్తోంది. ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత సెట్టింగ్స్ లో screen time managementలో కొత్త సదుపాయంగా ఫోకస్ మోడ్ వస్తుంది.ఏదైనా ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు, స్మార్ట్ ఫోన్ తప్పనిసరి అవసరాలకు తప్పించి మామూలుగా అందుబాటులో లేకుండా ఉండడం కోసం ఈ మోడ్ ఉపయోగపడుతుంది. ఉదాహరణకు దీన్ని సెలెక్ట్ చేసుకుంటే, కేవల ఎమర్జెన్సీ కాల్స్, అలాగే ఫోటోలు తీసుకోవడం తప్పించి మిగిలిన అన్ని ఫోన్ సదుపాయాలు డిజేబుల్ చేయబడతాయి. ఏదైనా అర్జెంటుగా పూర్తి చేయవలసిన పని ఉన్నప్పుడు ఈ కొత్త ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. 20 నిమిషాల నుండి గరిష్టంగా 90 నిమిషాల వరకు మీ అవసరాన్ని బట్టి Focus Mode సెలెక్ట్ చేసుకోవచ్చు.స్మార్ట్ ఫోన్ వినియోగం వలన, అనేకరకాల అప్లికేషన్లలో గంటల తరబడి సమయం గడపటం వలన ప్రొడక్టివిటీ నష్టపోతున్నామని భావించేవారు ఈ కొత్త సదుపాయం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. గూగుల్ సంస్థ ఇటీవల అనేక ప్రయోగాత్మకమైన అప్లికేషన్లను ఇలా ప్రొడక్టివిటీని దృష్టిలో పెట్టుకుని విడుదల చేసిన విషయం తెలిసిందే.

తాము వాడుతున్న స్మార్ట్ ఫోన్ మీద పూర్తిగా కంట్రోల్ కోల్పోయినవారు ఏదో ఒక విధంగా తిరిగి కంట్రోల్ సాధించడం కోసం ఇలాంటి Focus Mode ఇలాంటి సదుపాయం బాగా ఉపయోగపడతాయి. సో మీకు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీన్ని ప్రయత్నించి చూడండి.

No comments:

Post a Comment

Some Of The Best Malware Removal Tools For Windows

Despite the different cares and concerns we take, our computers often get infected with various malware from the internet. These days the ...