Saturday, 19 October 2019

Google Mapsని నెట్ లేకపోయినా వాడటం ఇలా!

బయటకు ఎక్కడికైనా వెళ్లాలంటే చాలా మంది తప్పనిసరిగా Google Maps
  మీద ఆధారపడుతుంటారు. ఇంకా తెలియని ఊళ్లకి వెళ్లాలంటే గూగుల్ మ్యాప్స్ లేకపోతే కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం.

ఈ నేపథ్యంలో కొన్ని సార్లు మనం వెళ్ళిన ప్రదేశంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోయినా, లేదా అప్పటికే మొబైల్ డేటా ఖర్చయిపోయినా  చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో గూగుల్ మ్యాప్స్ ఆఫ్లైన్లో డౌన్లోడ్ చేసుకోగలిగితే కచ్చితంగా అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది. మీరు ఎక్కడికైనా బయటకి వెళ్లాలనుకున్నప్పుడు ఆ ప్రదేశానికి సంబంధించిన గూగుల్ మ్యాప్స్ ముందే download  చేసుకుని వెళ్లడం మంచిది.గూగుల్ మ్యాప్స్ ముందే ఆఫ్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలంటే.. మొట్టమొదట మీ ఇంటి దగ్గర వైఫై కనెక్షన్ లో ఉన్నప్పుడు మాత్రమే డౌన్లోడ్ కి ఉపక్రమించండి. దీనికి కారణం మీరు ఎంపిక చేసుకునే ప్రదేశాన్ని బట్టి 100 MB మొదలుకుని 300 MB వరకూ  మొబైల్ డేటా ఖర్చవుతుంది. అలాగే మీ ఫోన్లో ఇంటర్నల్ స్టోరేజ్ లో తగినంత స్పేస్ ఉండే విధంగా కూడా చూడాలి. మీకు ఏ ప్రదేశానికి సంబంధించిన గూగుల్ మ్యాప్ కావాలి అది ఆ ప్రదేశం వద్ద రెడ్ కలర్ మార్కర్ అమర్చుకుని, ఆ తర్వాత గూగుల్ మ్యాప్స్ అప్లికేషన్లో   మెనూ లోకి వెళితే Offline Maps అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని select your own map అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మీకు కావాల్సిన ప్రదేశాన్ని ఆఫ్లైన్లో లభించే విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.Map డౌన్లోడ్ చేసుకోవడానికి ముందు అది ఎంత పరిమాణం  ఆక్రమిస్తుంది అన్నది ఫోన్ స్క్రీన్ మీద చూపించబడుతుంది. మీరు జూమవుట్  చేసుకుంటూ వెళ్లే కొద్దీ మరింత ఎక్కువ పరిమాణం సెలెక్ట్ అయ్యి, ఆటోమేటిక్ గా డౌన్ లోడ్ చేయాల్సిన మ్యాప్ పరిమాణం బాగా పెరిగిపోతుంది. కాబట్టి మీకు ఎంత వరకు కావాలో అంత వరకు మాత్రమే సెలక్ట్ చేసుకోవడం మంచిది. ఇకమీదట మీరు ఆ ప్రదేశానికి నేరుగా వెళ్ళినప్పుడు అక్కడ ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోయినప్పటికీ ఇప్పటికే మీ ఫోన్లో డౌన్లోడ్ అయి ఉన్న మ్యాప్స్ ఆధారంగా మీకు నావిగేషన్ చూపించబడుతుంది. అయితే నిర్దిష్టమైన సమయం తర్వాత ఇలా డౌన్లోడ్ చేయబడిన మ్యాప్స్  ఆటోమేటిక్ గా తొలగించబడతాయి. కాబట్టి మీరు గతంలో డౌన్లోడ్ చేసుకున్న మ్యాప్స్ అయినా అదే ప్రదేశానికి వెళ్లబోయే ముందు ఒకసారి చెక్ చేసుకుని, అప్పటికే డిలీట్ అయి ఉంటే మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవడం మంచిది.

No comments:

Post a Comment

Know Who Tried To Access Your Device After You Shut It Down

If you have got some very important and personal information on your PC, then you must be careful about your device and do not easily let ...