Tuesday, 8 October 2019

ఇక Android Phoneలలో తప్పనిసరిగా ఈ ఫీచర్స్ ఉండాలి!

Android ఆపరేటింగ్ సిస్టం ని తయారు చేసిన Google  ఫోన్ తయారీ కంపెనీలకు కొన్ని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఇకమీదట Samsung, OnePlus, Xiaomi, Oppo, Vivo  వంటి వివిధ ఫోన్ తయారీ కంపెనీలు తయారు చేసే తాజా ఫోన్స్ తప్పనిసరిగా రెండు సదుపాయాలు కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే గూగుల్ సంస్థ వారికి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఉపయోగించుకునే వెసులుబాటు కల్పిస్తుంది. ఆ రెండు సదుపాయాల్లో మొట్టమొదటిది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కు సంబంధించినది. ఇటీవలి కాలంలో దాదాపు అన్ని ఫోన్స్ బ్యాటరీ వేగంగా ఛార్జింగ్ అయ్యేవిధంగా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తున్న విషయం తెలిసిందే.
అయితే దీనికి సంబంధించి అన్ని ఫోన్ తయారీ కంపెనీలు దేనికదే విడివిడిగా తమకంటూ ప్రత్యేకమైన టెక్నాలజీలు కలిగి ఉంటున్నాయి. ఈ కారణం చేత ఒక ఫోన్ కి వాడే చార్జర్ మరో ఫోన్ కి వాడాలంటే బ్యాటరీ పరంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఒకవేళ చార్జర్ పాడైనా, లేదా చార్జర్ పోగొట్టుకున్నా వినియోగదారులు తప్పనిసరిగా ఆ ఫోన్ చేయాలి కంపెనీ విడుదల చేసిన ప్రొప్రైటరీ చార్జర్ మాత్రమే కొనాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో USB-C PD Chargers విషయంలో ఫోన్ తయారీ సంస్థలు అన్ని ఒకే విధమైన ప్రమాణాలు పాటించే విధంగా గూగుల్ తప్పనిసరి చేసింది. అంటే ఇకమీదట ఒక ఫోన్ యొక్క చార్జర్ మరో ఫోన్ కి ఎలాంటి సందేహాలు లేకుండా వాడుకోవచ్చు.ప్రాక్టికల్ గా మార్కెట్ ఉన్న పరిస్థితి గమనిస్తే OnePlus సంస్థ తన ఫోన్స్ లో వాడుతున్న Wrap Charge టెక్నాలజీ, మరియు Samsung సంస్థ ఉపయోగిస్తున్న ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఇప్పటివరకు థర్డ్-పార్టీ యాక్సెసరీలను సపోర్ట్ చేయడం లేదు. ఫోన్ కొనేటప్పుడు వారు పేర్కొంటున్న వేగవంతమైన ఛార్జింగ్ స్పీడ్‌లు సాధించాలంటే తప్పనిసరిగా వారినుండే చార్జర్లు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. గూగుల్ తాజా నియమాల ప్రకారం ఇకమీదట థర్డ్-పార్టీ ఛార్జర్లని కూడా వినియోగించుకోవచ్చు.

ఇకపోతే రెండో నియమం విషయానికి వస్తే, smartphone తయారీ కంపెనీలు తప్పనిసరిగా తయారుచేసే ఫోన్లలో.. డిజిటల్ వెల్ బీయింగ్ సదుపాయం పొందుపరచాలి. ఒక యూజర్ ఫోన్ ఎంత సేపు వాడారు, కంటి మీద ఒత్తిడి తగ్గించుకునే సెట్టింగ్స్, స్క్రీన్ కలర్ ప్రొఫైల్ మార్చు కునే అవకాశం వంటి అన్ని రకాల సెట్టింగ్స్ అందులో భాగంగా అందించాల్సి ఉంటుంది. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల ఫోన్ వినియోగం మీద కంట్రోల్ కలిగి ఉండే విధంగా గూగుల్ ఫ్యామిలీ లింక్ పేరంటల్ కంట్రోల్ సదుపాయాలు కూడా ఇవి అందించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 3, 2019 తర్వాత తయారుచేయబడే అన్ని ఫోన్స్ తప్పనిసరిగా ఈ రెండు నియమాలు పాటిస్తే మాత్రమే గూగుల్ వాటిలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం వాడుకోడానికి అవకాశం ఇస్తుంది.

No comments:

Post a Comment

Know Who Tried To Access Your Device After You Shut It Down

If you have got some very important and personal information on your PC, then you must be careful about your device and do not easily let ...