Sunday, 22 September 2019

మీ phoneలో కొత్తగా వస్తున్న Ultra Wide Angle ఎలా ఉపయోగపడుతుందంటే..

ఇటీవల కాలంలో మీరు నిశితంగా గమనిస్తే కనుక దాదాపు అన్ని smartphoneలలో Ultra Wide Angle అనే  ఒక ప్రత్యేకమైన మోడ్ లభిస్తోంది.
ఆండ్రాయిడ్ ఫోన్స్ విషయానికొస్తే Samsung Galaxy Note 10, S10, One Plus 7 Pro, Huawei P30 Pro, Motorola One Action వంటి  అనేక రకాల ఫోన్స్ లో కెమెరా అప్లికేషన్ లో ఈ మోడ్ లభిస్తోంది. ఇక ఐఫోన్ విషయానికి వస్తే, ఇటీవల విడుదలైన iPhone 11లో కూడా Ultra Wide Angle మోడ్  ప్రవేశపెట్టబడింది. అయితే చాలా మందికి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది పెద్దగా అవగాహన లేకపోవడం గమనార్హం.

వివరాలివి

ఈ నేపథ్యంలో అల్ట్రా వైడ్-యాంగిల్ మోడ్  గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సహజంగా ఒక ఫోన్లో 90 డిగ్రీల కోణం కన్నా  ఎక్కువ పరిమాణం కలిగిన దృశ్యాన్ని క్యాప్చర్ చేయగలిగిన కెమెరా లెన్సులను ultra wide angle lensలని  వ్యవహరిస్తూ ఉంటారు. ఫోకల్ లెంగ్త్ 24mm కన్నా తక్కువ ఉన్నవి ఇలాంటి సదుపాయం అందిస్తాయి. ఉదాహరణకు తాజాగా విడుదలైన iPhone 11నే  తీసుకుంటే, ఇందులో పొందు పరచబడిన 12 మెగాపిక్సల్ ultra wide lens 13mm ఫోకల్ లెంగ్త్‌ని, f/2.4 apertureని కలిగి ఉంది. తద్వారా మరింత ఫీల్డ్ ఆఫ్ వ్యూ  లభిస్తుంది. అంటే 120 డిగ్రీల వరకు మన ఎదురుగా ఉన్న దృశ్యాన్ని ఈ లెన్స్ ద్వారా క్యాప్చర్ చేయొచ్చు.

ఇదీ ప్రత్యేకత

ఒకవేళ మీ ఫోన్లో ultra wide angle lens ఉంటే గనక, కెమెరా అప్లికేషన్ లో దానిని సెలెక్ట్ చేసుకొని ఫోటో తీసినప్పుడు ఒక విషయం స్పష్టంగా గమనించండి.  మీకు దగ్గరగా ఉన్న మనుషులు కానీ వస్తువులు కానీ పెద్దగా కనిపిస్తాయి, అలాగే దూరంగా ఉన్నవి చిన్నగా కనిపించినప్పటికీ ఎక్కువ ఫీల్డ్ ఆఫ్ వ్యూ లభిస్తుంది.  దీంతో ఫోటో చాలా రియలిస్టిక్‌గా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. సహజంగా ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద బిల్డింగులు, కొండలు, రోడ్లు, గ్రీనరీ వంటి వాటిని  కళ్లెదుట కనిపించే దాన్ని ఎక్కువ భాగం ఫోటోలో పొందటం కోసం ఈ ultra wide angle మోడ్ ఉపయోగపడుతుంది. ఇటీవలి కాలంలో ఒక ఫోన్ లో వెనుక భాగంలో మూడు కెమెరాలు లభిస్తున్నాయి. వీటిలో ఒకటి ప్రైమరీ కెమెరా కాగా,  మరొకటి మాక్రో లెన్స్‌గానూ, మరొకటి ultra wide angle lens గానూ ఉండటం గమనార్హం.

No comments:

Post a Comment

Some Of The Best Malware Removal Tools For Windows

Despite the different cares and concerns we take, our computers often get infected with various malware from the internet. These days the ...