Monday, 30 September 2019

Flipkart Big Billion Days Saleలో సూపర్ ఆఫర్స్ ఇవి!

ఫ్లిప్కార్డ్ సంస్థ Flipkart Big Billion Days Sale మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అనేక
స్మార్ట్ ఫోన్ మోడల్స్ పెద్ద మొత్తంలో డిస్కౌంట్ కింద లభిస్తున్నాయి. కేవలం ఆయా మోడల్స్ కి సంబంధించిన డిస్కౌంట్ లో మాత్రమే కాకుండా యాక్సిస్ బ్యాంక్ మరియు ఐసిఐసిఐ బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డులు వాడేవారికి 10% instant discountని ఫ్లిప్కార్ట్ సంస్థ అందిస్తోంది. కాబట్టి ఒకవేళ మీకు ఏదైనా స్మార్ట్ఫోన్ కొనే ఆలోచన ఉంటే, ఈ సేల్ పూర్తి కాబోయే ముందు వెంటనే కొనుగోలు చేయడం మంచిది.

Redmi Note 7S: ఈ ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా ఈ మోడల్ మీద భారీగా డిస్కౌంట్ లభిస్తుంది. డిస్కౌంట్ కింద కేవలం 9999 రూపాయలకు ఈ ఫోన్ కొనుగోలు చేయొచ్చు.
Redmi Note 7 Pro: అలాగే ఈ ఫోన్ కూడా డిస్కౌంట్ కింద కేవలం 11999 రూపాయలకి లభిస్తుంది. యాక్సెస్ మరియు ఐ సి ఐ సి ఐ కార్డులు వాడేవారికి అదనపు డిస్కౌంట్ ఎటూ లభిస్తుంది.
Vivo Z1 Pro: వివో సంస్థ Z సిరీస్ లో మొట్టమొదట విడుదల చేసిన ఫోన్ ఇది. కేవలం 12,990 రూపాయలకు ఈ ఫోన్ కొనుగోలు చేయొచ్చు. అదనంగా బ్యాంక్ ఆఫర్లు కూడా అందించబడతాయి.
Redmi 7A: ఇటీవల Xiaomi సంస్థ భారతీయ మార్కెట్లో Redmi 8A లేటెస్ట్ మోడల్ విడుదల చేసిన నేపథ్యంలో, దానికి సంబంధించిన పాత మోడల్ అయిన Redmi 7A ప్రస్తుతం కేవలం 4999 రూపాయలకే లభిస్తోంది.
Redmi K20: కొన్నాళ్ల క్రితం ఈ ఫోన్ విడుదలైనప్పుడు దీని గురించి చాలామంది మాట్లాడుకున్నారు. ప్రస్తుత మీ ఫోన్ డిస్కౌంట్ కింద కేవలం 19999 రూపాయలకు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా అమ్మబడుతోంది.
Poco F1: సంవత్సరం క్రితం విడుదలైన ఈ ఫోన్ ఇప్పుడు కేవలం 14999 రూపాయలకు ఈ ప్రత్యేకమైన సేల్‌లో లభిస్తుంది.
Asus 6Z: Asus సంస్థ ఇటీవల విడుదల చేసిన తాజా ఫ్లాగ్షిప్ ఫోన్ ఇది. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ సేల్‌లో భాగంగా దీన్ని కేవలం 27999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు.
Pixel 3A: గూగుల్ సంస్థ తక్కువ బడ్జెట్ ఉన్న వినియోగదారుల కోసం విడుదల చేసిన ఈ మోడల్ ఇప్పుడు కేవలం 29,999 రూపాయలకు అందుబాటులో ఉంది.
పైన చెప్పబడిన అన్ని ఫోన్స్ కి యాక్సెస్ మరియు ఐసిఐసిఐ బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్స్టెంట్ డిస్కౌంట్ లభించటం గమనార్హం.

No comments:

Post a comment

An Awesome Disk Space Analyzer For Low Memory Problem

The biggest problem the users of any device like tablets, laptops, PCs, and phones face these days is the  low memory  problem.  We may find...