Monday, 30 September 2019

సెకండ్ సిమ్ కార్డ్ అటాక్ – తాజాగా వచ్చిన కొత్త ప్రమాదం!

స్మార్ట్ ఫోన్ వాడే వారికి ఎప్పటికప్పుడు అనేక కొత్త ప్రమాదాలు పొంచి ఉంటున్నాయి.  ఇటీవల కాలంలో SimJacker అనే ఒక మాట గురించి వివరంగా తెలుసుకుందాం కదా. 




సరిగ్గా ఇప్పుడు అదే విధంగా పనిచేసే మరొక సెక్యూరిటీ లోపం గురించి పరిశోధకులు కనుగొన్నారు.
WIBattack  పేరుతో పిలవబడే ఈ సరికొత్త ప్రమాదం మన ఫోన్ సిం కార్డ్స్ లో ఉండే వైర్లెస్ ఇంటర్నెట్ బ్రౌజర్ ని కాంప్రమైజ్ చేయడం ద్వారా ప్రమాదాన్ని సృష్టిస్తుంది.  ముఖ్యంగా ఫోన్ లో ఉండే అతి కీలకమైన ఫంక్షన్స్ అన్నింటిని ఇది కంట్రోల్ లోకి తీసుకుంటుంది. ఈ సెక్యూరిటీ లోపాన్ని హైజాక్ చేయటానికి హ్యాకర్లకు కావలసింది కేవలం ఒక్క ఎస్ఎంఎస్ మెసేజ్ మాత్రమే.  అంటే ఈ సెక్యూరిటీ లోపమున్న సిమ్ కార్డు లోకి ఒకే ఒక ఎస్ఎంఎస్ మెసేజ్ పంపించి పూర్తిగా ఆ ఫోన్ కి సంబంధించిన అన్ని కీలకమైన ఫంక్షన్స్ అన్నిటినీ హ్యాకర్లు తమ కంట్రోల్ లోకి తీసుకునే అవకాశం ఉంటుంది.
దీని సాయంతో మీ ఫోన్ యొక్క లొకేషన్ తెలుసుకోవడం మాత్రమే కాకుండా, మీ ప్రమేయం లేకుండా మీ ఫోన్లో ఫిషింగ్ వెబ్సైట్లు ఓపెన్ అయ్యే విధంగా చేసి వాటి ఆధారంగా మీ యూజర్ నేమ్ పాస్‌వర్డ్‌లు  దొంగిలించడం వంటి పనులు చేయగలుగుతారు. వీటితోపాటు భారీ మొత్తంలో చార్జీలు పడే నెంబర్లకు కాల్ చేయడం వంటి ఇతర పనులు కూడా ఈ సెక్యూరిటీ లోపం ఆధారంగా జరిగే అవకాశం ఉంటుంది.
సిం కార్డు ఆధారంగా జరిగే ఈ సరికొత్త ఫ్రాడ్ కి ఇప్పటి వరకు ఎంత మంది గురయ్యారు అన్న విషయం ఇంకా స్పష్టం కాకపోయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా పెద్ద మొత్తంలో సిమ్ కార్డులు మాత్రమే ఇప్పటికి ఈ లోపాన్ని కలిగి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు కేవలం ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టంలు  కలిగిన ఫోన్ లో మాత్రమే ప్రమాదమని భావించేవారు ఇక మీదట మరింత జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది.

No comments:

Post a comment

An Awesome Disk Space Analyzer For Low Memory Problem

The biggest problem the users of any device like tablets, laptops, PCs, and phones face these days is the  low memory  problem.  We may find...