Monday, 30 September 2019

ఫోన్లలో వైర్లెస్ ఛార్జింగ్ మరింత శక్తివంతంగా వచ్చేసింది!

దాదాపు పదేళ్ళ నుండి వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పటికీ ఇటీవలి కాలం వరకు అది పెద్దగా పాపులర్ కాలేదు.


అయితే గత కొన్ని ఏళ్లుగా Samsung Galaxy ఫోన్లలో కొన్నింటిలో,  అలాగే Xiaomi Mi Mix 3, Google Pixel 3 వంటి అనేక ఇతర కంపెనీలకు చెందిన ఫోన్స్ లో వైర్లెస్ చార్జింగ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పటికీ మామూలు వైర్డ్ చార్జింగ్ పోలిస్తే వైర్లెస్ ఛార్జింగ్ అనేది చాలా నెమ్మదిగా ఉంటుంది.  అందుకే చాలామంది వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్లు కొనుగోలు చేయడానికి పెద్దగా సుముఖత వ్యక్తం చేసేవారు కాదు.
అయితే మెల్లగా ఇటీవలికాలంలో పరిస్థితి మారుతోంది. వైర్డ్ ఛార్జింగ్ మాదిరిగానే  మరీ అంత పూర్తి స్థాయిలో కాకపోయినా దాదాపు అదే మాదిరిగా వేగంగా ఫోన్ చార్జింగ్ అయ్యే విధంగా అనేక ఫోన్స్ లో మొబైల్ లో ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తోంది.  ఉదాహరణకు ఇటీవల LG G8 ఫోన్ విషయంలో గరిష్టంగా 20 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ప్రవేశపెట్టబడింది. ఇదిలా ఉంటే మరో పక్క షామీ మరియు ఒప్పో సంస్థలు 30W  వైర్లెస్ ఛార్జింగ్ కూడా అందించబోతున్నట్లు ప్రకటించాయి. ఉదాహరణకు Xiaomi తీసుకువచ్చిన Mi 9 Pro 5G మోడల్ విషయానికొస్తే 0 నుండి 100 శాతం వరకు కేవలం అరవై తొమ్మిది నిమిషాల్లో చార్జింగ్ పూర్తయ్యే విధంగా 30W  వైర్లెస్ ఛార్జింగ్ అందించబడింది.
కేవలం అంతటితో సరిపెట్టుకోలేదు. 40W  కెపాసిటీ కలిగిన వైర్లెస్ చార్జింగ్ కూడా తీసుకు రాబోతున్నట్లు మరికొన్ని సంస్థలు ప్రకటించాయి.  వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే కనుక 2019 మరియు 2020 సంవత్సరాలు పూర్తిగా వేగవంతమైన వైర్లెస్ చార్జింగ్ టెక్నాలజీకి ఊతం ఇచ్చాయి  అనడంలో సందేహం లేదు. అయితే ఇప్పటివరకు వైర్లెస్ చార్జింగ్ టెక్నాలజీలో ఒక పెద్ద అసంతృప్తి ఉంది. అదేంటంటే ప్రత్యేకంగా ఎలాంటి ప్యాడ్స్  వాడాల్సిన పని లేకుండా పూర్తిగా విద్యుత్తు అనేది వైర్లెస్గా ట్రాన్స్ఫర్ చేసుకోగలిగితే అప్పుడు మాత్రమే నిజమైన వైర్లెస్ సాధ్య పడినట్లుగా భావించాలి,  అప్పటివరకు ఎక్కడికి వెళ్ళినా మనతోపాటు వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్లని వెంట తీసుకు వెళ్లడం మాత్రం ఇబ్బందిగానే ఉంటుంది.

1 comment:

  1. UX design team managed the project smoothly and ensured
    app agency was effective and therefore the timeframe kept while addressing any issues quickly and professionally.

    ReplyDelete