Monday, 30 September 2019

ATMలో డబ్బులు డ్రా చేయబోతున్నారా? అయితే కొత్తగా అతి పెద్ద ప్రమాదం వచ్చింది!

ATM  మిషన్ల ద్వారా డబ్బులు విత్ డ్రా చేసేటప్పుడు కార్డు క్లోనింగ్ జరిగే అవకాశం ఉంటుందని చాలా మందికి తెలిసిందే.
అయితే దానికి అదనంగా మరో సరికొత్త ప్రమాదం వెలుగులోకి వచ్చింది.

ప్రధానంగా భారతీయ వినియోగదారులను టార్గెట్ చేస్తున్న ఒక సరికొత్త ATM Malware గురించి ప్రముఖ యాంటీవైరస్ సంస్థ కాస్పర్‌స్కై భారతీయ వినియోగదారులను హెచ్చరిస్తోంది. ATMDtrack  అని పిలవబడే ఈ బ్యాంకింగ్ మాల్వేర్ నేరుగా ఏటీఎం మిషన్స్‌లో నిరంతరం రన్ అవుతూ మన లాంటి కస్టమర్స్ ఎవరైనా డబ్బులు విత్ డ్రా చేసుకోవడం కోసం ఏటీఎం లోకి ప్రవేశించి కార్డు పెట్టిన వెంటనే అందులో ఉండే కీలకమైన సమాచారం మొత్తాన్ని దొంగిలిస్తుంది.
2017 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా అందర్నీ గడగడలాడించిన WannaCry ransomware  గురించి అందరికీ గుర్తుండే ఉంటుంది. దానివి తయారుచేసిన Lazarus అనే సంస్థ ఈ సరికొత్త ఏటీఎం మాల్వేర్  రూపొందించడం గమనార్హం. వాస్తవానికి 2018 సంవత్సరం నుండి ఈ మాల్వేర్ వినియోగంగా ఉన్నప్పటికీ ఇటీవలి కాలంలో దీనికి సంబంధించిన రామారం బాగా పెరిగినట్లుగా కాస్పర్‌స్కై  వెల్లడించింది. ఇది ఒకసారి ఏటీఎం మిషన్ లోకి ప్రవేశించిన వెంటనే అందులోకి కొత్తగా ఫైల్స్ డౌన్లోడ్ చేయగలుగుతుంది, అలాగే అందులో ఉన్న ఫైల్స్ ఇతర ప్రదేశాలకు అప్లోడ్ చేయగలుగుతుంది.  దాంతోపాటు ఆ ఎటిఎం మెషిన్ లో ప్రెస్ చేసే కీలను రికార్డు కూడా చేయగలుగుతుంది. అలాగే వేరే ప్రదేశం నుండి ఎటిఎం మెషిన్ కంట్రోల్ చేయగలిగే విధంగా రిమోట్ అడ్మినిస్ట్రేషన్ టూల్‌గా కూడా  ఇది పని చేయటం గమనార్హం.
ఈ నేపథ్యంలో వినియోగదారులు ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ వివిధ బ్యాంకులు తమ నిర్వహించే ఏటీఎం ల విషయంలో తగినంత సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం దొంగల బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఏటీఎం సెక్యూరిటీ విషయంలో,  ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొచ్చే ఇలాంటి malwareల విషయంలో బ్యాంకులు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

No comments:

Post a comment

An Awesome Disk Space Analyzer For Low Memory Problem

The biggest problem the users of any device like tablets, laptops, PCs, and phones face these days is the  low memory  problem.  We may find...