Sunday, 22 September 2019

ఈ Android appsలో వైరస్ ఉన్నట్లు బయటపడింది.. జాగ్రత్త!

Google Play Storeలో  లభిస్తున్నప్పటికీ కొన్ని సందర్భాలలో గూగుల్ కళ్ళు కప్పి కొన్ని Andorid appsలో
malware  పొంచి ఉంటుంది.
ప్రముఖ యాంటీ వైరస్ సంస్థలు ఎప్పటికప్పుడు వివిధ అప్లికేషన్లను నిశితంగా పరిశీలించి వాటిలో ఉండే ప్రమాదకరమైన అంశాల గురించి బయట ప్రపంచానికి తెలియ చేస్తూ ఉంటాయి.  ఇందులో భాగంగా తాజాగా ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం మంది వాడుతున్న పలు ఆండ్రాయిడ్ యాప్స్ లో వైరస్ ఉన్నట్లు Avast యాంటీవైరస్ సంస్థ వెల్లడించింది. చాలామంది తమ ఫోన్ లో ఫ్లాష్ లైట్ సదుపాయం ఉన్నప్పటికీ,  మరిన్ని ఆప్షన్లను కోసం ప్రత్యేకంగా గూగుల్ ప్లే స్టోర్ నుండి ఫ్లాష్ లైట్ అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు.


ఇలా గూగుల్ ప్లేస్టోర్ లో లభించే 1000 వేర్వేరు  ఫ్లాష్ లైట్ అప్లికేషన్లను Avast పరిశీలించడం ద్వారా,  వాటిలో పలు అప్లికేషన్లలో మాల్వేర్ పొంచివున్నట్లు గ్రహించడం జరిగింది. అనేక మంది యూజర్లు రంగురంగుల ఫ్లాష్లైట్ వాడొచ్చని,  ఇంకా అదనపు సదుపాయాల కోసం తమ ఫోన్లో ప్లాస్ లైట్ సదుపాయం ఉన్నప్పటికీ థర్డ్-పార్టీ వాటి మీద ఆధార పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ మీ ఫోన్లో ఈ కింద చెప్పబడిన అప్లికేషన్స్ ఉన్నట్లయితే రెండో ఆలోచన లేకుండా వెంటనే తొలగించండి. వీటిలో మాల్వేర్ ఉన్నట్లు  నిర్ధారణ అయింది.

No comments:

Post a Comment

Know Who Tried To Access Your Device After You Shut It Down

If you have got some very important and personal information on your PC, then you must be careful about your device and do not easily let ...