Monday, 30 September 2019

సెకండ్ సిమ్ కార్డ్ అటాక్ – తాజాగా వచ్చిన కొత్త ప్రమాదం!

స్మార్ట్ ఫోన్ వాడే వారికి ఎప్పటికప్పుడు అనేక కొత్త ప్రమాదాలు పొంచి ఉంటున్నాయి.  ఇటీవల కాలంలో SimJacker అనే ఒక మాట గురించి వివరంగా తెలుసుకుందాం కదా. 

ఫోన్లలో వైర్లెస్ ఛార్జింగ్ మరింత శక్తివంతంగా వచ్చేసింది!

దాదాపు పదేళ్ళ నుండి వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పటికీ ఇటీవలి కాలం వరకు అది పెద్దగా పాపులర్ కాలేదు.

Flipkart Big Billion Days Saleలో సూపర్ ఆఫర్స్ ఇవి!

ఫ్లిప్కార్డ్ సంస్థ Flipkart Big Billion Days Sale మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అనేక

ATMలో డబ్బులు డ్రా చేయబోతున్నారా? అయితే కొత్తగా అతి పెద్ద ప్రమాదం వచ్చింది!

ATM  మిషన్ల ద్వారా డబ్బులు విత్ డ్రా చేసేటప్పుడు కార్డు క్లోనింగ్ జరిగే అవకాశం ఉంటుందని చాలా మందికి తెలిసిందే.

Sunday, 22 September 2019

మీ phoneలో కొత్తగా వస్తున్న Ultra Wide Angle ఎలా ఉపయోగపడుతుందంటే..

ఇటీవల కాలంలో మీరు నిశితంగా గమనిస్తే కనుక దాదాపు అన్ని smartphoneలలో Ultra Wide Angle అనే 

ఈ Android appsలో వైరస్ ఉన్నట్లు బయటపడింది.. జాగ్రత్త!

Google Play Storeలో  లభిస్తున్నప్పటికీ కొన్ని సందర్భాలలో గూగుల్ కళ్ళు కప్పి కొన్ని Andorid appsలో

TSCAB Recruitment 2019 | TSCAB Jobs List 2019 ...

TSCAB Recruitment 2019 - Free TSCAB Job alert for both Fresher and Experienced

20 వేల లోపు ధరలో 10 బెస్ట్ ఫోన్స్ ఇవి..

20 వేల రూపాయల్లో బెస్ట్ Phones సూచించమని చాలామంది తరచూ నన్ను అడుగుతూ ఉంటారు.  ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వాటిలో 20 వేలలో అద్భుతమైన ఫోన్స్ ఇప్పుడు చూద్దాం.

Realme X

16,999 రూపాయలకు లభించే  ఫోన్ ఇది. 6.53 అంగుళాల Full HD+ OLED  డిస్ప్లేను ఇది కలిగి ఉంటుంది. OLED డిస్ప్లే కావడంవల్ల రంగులు సహజసిద్ధంగా కనిపించడంతో పాటు తగినంత బ్రైట్నెస్ కూడా లభిస్తుంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, పాపప్  సెల్ఫీ కెమెరాలను కలిగి ఉన్న ఫోన్ ఇది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ ఆధారంగా పనిచేసే ఈ ఫోన్లో హైఎండ్ మోడల్‌లో 8 GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ వుంటాయి. బ్యాటరీ కెపాసిటీ 3,765 mAh.  కెమెరాల విషయానికొస్తే ఫోన్ వెనుక భాగంలో 48 మరియు 5 మెగా పిక్సల్ రెండు కెమెరాలు, ఫోన్ ముందు భాగంలో 16 megapixel సెల్ఫీ కెమెరా ఉంటాయి. 4K రిజల్యూషన్  ఉన్న వీడియోలను ఈ ఫోన్ తో షూట్ చేయొచ్చు. వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు కూడా మంచి ఫోటోలు తీయ కలిగే విధంగా Nightscape అనే సదుపాయం దీంట్లో ఉంటుంది. Android 9 Pie  ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా ఈ ఫోన్ పని చేస్తుంది. ఫోన్ వేగంగా ఛార్జింగ్ అవడం కోసం ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.

Oppo K3

16,990 రూపాయలకు దీన్ని కొనుగోలు చేయవచ్చు. 6.5 అంగుళాల 1080×2340 pixels  రిజల్యూషన్ కలిగిన డిస్ప్లే దీంట్లో ఉంటుంది. గొరిల్లా గ్లాస్ 5 చేత రక్షణ లభించే ఈ స్క్రీన్ AMOLED  డిస్ప్లే కావటం వలన రంగులు అద్భుతంగా ఉండటంతో పాటు, తగినంత sharpness, బ్రైట్ నెస్ కూడా లభిస్తాయి. ఇన్-డిస్‌ప్లే  ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు పాపప్ సెల్ఫీ కెమెరా కూడా దీంట్లో ఉంటాయి. Snapdragon 710 ప్రాసెసర్ ఆధారంగా పనిచేసే ఈ ఫోన్లో 6 GB RAM, 64 GB  ఇంటర్నల్ స్టోరేజ్ వుంటాయి. 3,765 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీతో, ఫోన్ వెనుక భాగంలో 16 మరియు 2 మెగాపిక్సల్ కెమెరాలు,  
ఫోన్ ముందు భాగంలో 16 మెగా పిక్సల్ కెమెరా లభిస్తాయి. Android 9 Pie  ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఈ ఫోన్ పనితీరు బాగుంది. గేమ్స్ ఆడేటప్పుడు ఓవర్‌హీట్  కావడం లేదు. ఫోన్ కింద భాగంలో ఉన్న స్పీకర్ Dolby Atmos సపోర్ట్ కలిగి ఉంటుంది. ప్రైమరీ కెమెరా ఆటో ఫోకస్ వేగంగా అవుతోంది. ఈ ఫోన్లోని కెమెరాతో మంచి లాండ్‌స్కేప్‌లు క్యాప్చర్ చేసుకోవడంతో పాటు వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు కూడా పనితీరు బాగుంటుంది.  బ్యాటరీ లైఫ్ మెరుగ్గా రావడంతోపాటు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కూడా దీనికి ఉంది.

Vivo Z1X

6.38 అంగుళాల  స్క్రీన్ పరిమాణంతో 1080×2340 pixels  రిజల్యూషన్ కలిగిన ఫోన్ ఇది. 16,990 రూపాయలకు దీన్ని కొనుగోలు చేయొచ్చు.  క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. 6GB RAM, 64 GB  ఇంటర్నల్ స్టోరేజ్ దీంట్లో ఉంటాయి. 4500 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ‌తో పాటు, ఫోన్ వెనుక భాగంలో 48 megapixel ప్రైమరీ కెమెరా తో పాటు, 8 మరియు 2  మెగాపిక్సెల్ మరో రెండు కెమెరాలు ఉంటాయి.
ఫోన్ ముందుభాగంలో 32 megapixel సెల్ఫీ కెమెరా లభిస్తుంది. Super AMOLED డిస్ప్లే కావడంవల్ల స్క్రీన్ మీద రంగులు సహజ సిద్ధంగా ఉంటాయి.  మిగతా అన్ని విషయాలు బాగానే ఉన్నప్పటికీ కెమెరా క్వాలిటీ విషయంలో మాత్రం మిగతా ఫోన్ లతో పోలిస్తే కొద్దిగా తక్కువ క్వాలిటీ లభిస్తుంది.

Realme XT

15,999 రూపాయలకి  లభించే ఫోన్ ఇది. 6.4 అంగుళాల 1080×2340 pixels రిజల్యూషన్  కలిగిన ఈ ఫోన్ ప్రపంచంలోనే మొట్టమొదటి 64 megapixel ప్రైమరీ కెమెరా కలిగి ఉంటుంది. కేవలం అది మాత్రమే కాదు,  ఫోన్ వెనుక భాగంలో 8, 2, 2 మెగాపిక్సల్ రిజల్యూషన్ కలిగిన మరో మూడు కెమెరాలు ఉంటాయి. అలాగే సెల్ఫీల కోసం ముందు భాగంలో 16 మెగా పిక్సల్ కెమెరా ఉంటుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తూ Android Pie  ఆపరేటింగ్ సిస్టమ్ కలిగి ఉన్న ఫోన్ ఇది. USB Type – C పోర్ట్‌‌తో ఇది వస్తుంది. గొరిల్లా గ్లాస్ 5 రక్షణ లభించటంతో పాటు ఫేస్ అన్లాక్, ఇన్-‌డిస్‌ప్లే ఫింగర్ప్రింట్ సెన్సార్ వంటి ఆప్షన్లు లభిస్తాయి. ఈ ఫోన్ లో 4000 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ ఉంటుంది.  ఒకరోజు పాటు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు ఉండటంవల్ల కేవలం గంటలో బ్యాటరీ చార్జింగ్ పూర్తవుతుంది. 64 మెగాపిక్సల్ కెమెరా ద్వారా నాణ్యమైన ల్యాండ్స్కేప్ ఫోటోలు, క్లోజప్ షాట్లు పొందొచ్చు. 4K రిజల్యూషన్ వరకూ వీడియోలు షూట్ చేసుకోవచ్చు.

Samsung Galaxy M40

19,990 రూపాయలకి విక్రయించబడుతున్న ఈ ఫోన్లో 6.30 అంగుళాల 1080×2340 పిక్సెళ్ల రిజల్యూషన్ కలిగిన డిస్ప్లే ఉంటుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ ఆధారంగా పనిచేసే ఈ ఫోన్లో 6 GB RAM, 128 GB  ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయి. 3500 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ, ఫోన్ వెనుక భాగంలో 32 megapixel ప్రైమరీ కెమెరా, వాడి తో పాటు 5 మరియు 8 మెగాపిక్సెల్ మరో రెండు కెమెరాలు ఉంటాయి. ముందు భాగంలో 16 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది.  దీంట్లో అమర్చబడిన క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ మెరుగైన పనితీరు అందిస్తున్నప్పటికీ, గేమ్స్ ఆడేటప్పుడు మాత్రం ఫోన్ వేడెక్కుతుంది. Adroid 9 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా ఈ ఫోన్ పని చేస్తుంది. ఇందులో ఉన్న 32 megapixel ప్రైమరీ కెమెరా వెలుతురు బాగున్నప్పుడు మంచి ఫోటోలు తీయగలిగినప్పటికీ వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఆటోఫోకస్ నెమ్మదిగా ఉండటంతోపాటు, తీయబడిన ఫోటోల్లో డీటెయిల్ కూడా మిస్ అవుతుంది.  వైడ్ యాంగిల్ కెమెరా ఉపయుక్తంగా ఉంటుంది కానీ అది అంత గొప్పగా లేదు. గరిష్టంగా 4K రిజల్యూషన్ కలిగిన వీడియోలను షూట్ చేసుకోవచ్చు. అయితే వీడియో స్టెబిలైజేషన్ మాత్రం లభించదు. ఒకరోజు పూర్తిగా ఫోన్ ఛార్జింగ్ లభిస్తుంది.

Motorola One Vision

19,999 రూపాయల ధరకు ఈ ఫోన్ లభిస్తుంది.  6.30 అంగుళాల 1080×2520 పిక్సెళ్ల రిజల్యూషన్‌తో  సాంసంగ్ ఎగ్జినోస్ 9609 ప్రాసెసర్ ఆధారంగా పనిచేసే ఈ ఫోన్లో 4GB RAM, 128 GB  ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయి. 3500 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ ఉంటుంది. ఫోన్ వెనుక భాగంలో 48 మరియు  5 మెగా పిక్సల్ రెండు కెమెరాలు, ముందు భాగంలో 25 megapixel సెల్ఫీ కెమెరా ఉంటాయి. రోజువారీ పనులకు ఇది బానే పని చేస్తుంది.గేమింగ్ పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. 48 megapixel ప్రైమరీ  కెమెరా ద్వారా తీసిన ఫోటోలు మంచి డీటెయిల్ కలిగి ఉన్నప్పటికీ, చాలా సందర్భాల్లో ఓవర్ శాట్యురేట్ అయినట్టు కనిపిస్తున్నాయి. వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఇదే ధరలో ఉన్న మిగతా అన్ని ఫోన్ల తో పోలిస్తే ఈ ఫోన్లో నాణ్యమైన ఫోటోలు లభిస్తున్నాయి.  ఒకరోజు పూర్తిగా బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది.15W TurboPower Charger ద్వారా రెండు గంటల లోపు 100% బ్యాటరీ ఛార్జింగ్ పూర్తవుతుంది.

Oppo F11 Pro

6.53 అంగుళాల 1080×2340 పిక్సెళ్ల రిజల్యూషన్ కలిగిన స్క్రీన్‌ని  ఈ ఫోన్ కలిగి ఉంటుంది. మీడియా టెక్ హీలియో P70 ప్రాసెసర్ ఆధారంగా పనిచేసే ఈ ఫోన్లో 6 GB RAM, 64 GB  ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయి. 4000 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీతో లభిస్తున్న ఈ ఫోన్‌ని 19,500లకి కొనుగోలు చేయొచ్చు.  ఫోన్ వెనుక భాగంలో 48 మరియు 5 మెగా పిక్సల్ రిజల్యూషన్ కలిగిన రెండు కెమెరాలు, ఫోన్ ముందు భాగంలో 16 మెగా పిక్సల్ కెమెరా ఉంటాయి.

Samsung Galaxy A50

6.4 అంగుళాల 1080×2340 పిక్సెళ్ల రిజల్యూషన్ కలిగిన ఈ ఫోన్లో ఎగ్జినోస్ 9610 ప్రాసెసర్ ఉంటుంది. ఇది ప్రీమియం ప్రాసెసర్. Super AMOLED  డిస్ప్లే కావటంవల్ల రంగులు సహజ సిద్ధంగా ఉంటాయి. ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ దీంట్లో ఉంటుంది. టిఫిన్ విషయానికొస్తే ఇంటెలిజెంట్ సీన్ ఆప్టిమైజేషన్, 480 fps  స్లో మోషన్ వీడియో రికార్డింగ్ వంటి శక్తివంతమైన సదుపాయాలు కూడా దీంట్లో ఉంటాయి. ఫోన్ పనితీరు, డిస్ప్లే మరియు బ్యాటరీ లైఫ్ సంతృప్తికరంగా ఉన్నాయి. ఫోన్ వెనుక భాగంలో 25 మరియు 5 మరియు 8 మెగాపిక్సల్ రిజర్వేషన్ కలిగిన మూడు కెమెరాలు,  ఫోన్ ముందు భాగంలో 25 megapixel సెల్ఫీ కెమెరా ఉంటాయి. కెమెరా నాణ్యత బాగున్నప్పటికీ, వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఫోటోలో అంత గొప్పగా ఉండవు. సాంసంగ్ కంపెనీ ఫోన్ ఇష్టపడేవారు రెండో ఆలోచన లేకుండా దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. దీని ధర 18,300.

Vivo V11 Pro

6.41 అంగుళాల 1080×2340 పిక్సెళ్ల రిజల్యూషన్  కలిగిన Super AMOLED డిస్ప్లేతో ఈ ఫోన్ లభిస్తుంది.  క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 660 processor ఆధారంగా పనిచేసే ఈ ఫోన్లో 6 GB RAM, 64 GB  ఇంటర్నల్ స్టోరేజ్ వుంటాయి. 3400 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీతో, ఫోన్ వెనుక భాగంలో 12 మరియు 5 మెగాపిక్సెల్,  ఫోన్ ముందు భాగంలో 25 megapixel రిజల్యూషన్ కలిగిన కెమెరాలు ఉంటాయి.3400 mAh కెపాసిటీనే అయినప్పటికీ బ్యాటరీ లైఫ్ మెరుగ్గా ఉండటంతోపాటు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. దీని ధర 15,790.

Xiaomi Poco F1

6.18 అంగుళాల 1080×2246 పిక్సెళ్ల రిజల్యూషన్ తో శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 845 processor ఆధారంగా పనిచేసే ఈ ఫోన్  ప్రస్తుతం 16,999 రూపాయలకి లభిస్తోంది. 6GB RAM, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగివుండి, 4000 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీతో,  ఫోన్ వెనుక భాగంలో 12 మరియు 5 మెగాపిక్సల్ కెమెరాలు, ముందు భాగంలో 20 megapixel సెల్ఫీ కెమెరా ఉంటాయి.

Google Payలోనే ఇక నేరుగా షాపింగ్ చేసుకోవచ్చు!

Google Pay  కేవలం ఒకరికొకరు పేమెంట్స్  పంపించుకోవటానికి మాత్రమే

ఈ కొత్త Oppo Reno Ace ఫోన్లో కేవలం అరగంటలో 100% చార్జింగ్ పూర్తవుతుంది!

ఇటీవల కాలంలో smartphoneలలో  ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వచ్చిన తర్వాత,  గతంలో మాదిరిగా

మీ ఇంట్లో Smart TV ఉందా? మీకు తెలియకుండా డేటా లీక్ చేస్తోందట!

ఈ మధ్య కాలంలో దాదాపు అందరు Smart TVలనే  కొనుగోలు

Thursday, 19 September 2019

Railway Recruitment 2019: Fresh Notification For Clerk Posts; Check Details

The Central Railway has released a recruitment notification for all those government job

Wednesday, 18 September 2019

భారత్ బిల్ పేమెంట్ సిస్టం ద్వారా ఇక అన్ని బిల్లులూ ఆటోమేటిక్ గా చెల్లించవచ్చు!

Google Pay, PhonePe, Paytm వంటి అప్లికేషన్లు పాపులరైనంతగా, Bharat Bill Payment System పాపులర్ కాలేదు

Google Pay, PhonePeలో వస్తున్న మార్పులివి!


UPI (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) ఆధారంగా పనిచేసే Google Pay, PhonePe లాంటి

Sunday, 15 September 2019

Kakatiya University Degree Revaluation Results 2019 2nd, 4th, 6th Sem @ kuonline.co.in

Candidates who appeared for the degree exam waiting for the announcement of