Thursday, 27 June 2019

Youtube తాజాగా మీకు నచ్చని ఛానల్స్ విషయంలో పూర్తి కంట్రోల్ ప్రవేశపెట్టింది!

సహజంగా Youtube మొబైల్ అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు గాని,  లేదా డెస్క్ టాప్ లో యూట్యూబ్
హోం పేజీ ఓపెన్ చేసినప్పుడు గానీ వివిధ ఛానెళ్లకి  సంబంధించిన వీడియోలతో కూడిన ఫీడ్ ఓపెన్ కావడం తో పాటు, రికమండేషన్లు కూడా చూపించ బడుతూ ఉంటాయి.

youtube new features

అయితే వాటిలో మనకు నచ్చని కొన్ని చానళ్లు ఉండవచ్చు.  అలాంటప్పుడు యూసర్‌కి మరింత కంట్రోల్ అందించే విధంగాకొత్త ఆప్షన్లను తాజాగా ప్రవేశపెట్టింది. వీటిని ఉపయోగించడం ద్వారా మనకు ఏదైనా నిర్దిష్టమైన ఛానల్ నుండి వీడియోలు చూడటం ఇష్టం లేకపోతే, అవి ఇకమీదట suggested వీడియోలుగా  చూపించబడకుండా అడ్డుకోవచ్చు. దీనికి గాను ఆ వీడియో పక్కనే మూడు చుక్కలతో ఉండే మెనూని ఓపెన్ చేసి Don’t recommend channel అనే ఆప్షన్ ఎంపిక చేసుకుంటే సరిపోతుంది.
అలాగే కొన్నిసార్లు అసలు మనకు పరిచయం లేని ఛానల్ నుండి Youtube వీడియోలను సజెస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒక నిర్దిష్టమైన వీడియోని  ఏ కారణం చేత యూట్యూబ్ మనకు చూపిస్తోంది అన్నది సులభంగా తెలుసుకునేలా ఒక ఇన్ఫర్మేషన్ కార్డ్ ఇక మీదట చూపించబడుతుంది. యూట్యూబ్ రికమండేషన్ algorithm సులభంగా అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
అలాగే యూట్యూబ్ అప్లికేషన్ హోం పేజీలో,  వివిధ టాపిక్స్ సంబంధించి వీడియోలు సులభంగా ఓపెన్ చేసుకునే విధంగా,  సంబంధిత టాపిక్స్ చూపించబడతాయి. వాటిని ఎంపిక చేసుకోవడం ద్వారా మరింత ఎక్కువ వీడియో కంటెంట్ చూసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెప్పుకున్న మూడు సదుపాయాలు Youtube మొబైల్ అప్లికేషన్ తో పాటు డెస్క్టాప్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చాయి. Youtubeని  మన అవసరాలకు తగ్గట్లు మరింత కష్టమైజ్ చేసుకోవడం కోసం ఇవి సహకరిస్తాయి.

No comments:

Post a Comment

Some Of The Best Malware Removal Tools For Windows

Despite the different cares and concerns we take, our computers often get infected with various malware from the internet. These days the ...