Wednesday, 26 June 2019

Telegram యాప్‌లో సూపర్ ఫీచర్లు వచ్చాయి!

అందరూ Whatsapp వాడతారు గానీ,  దాంతో పోలిస్తే అనేక శక్తివంతమైన సదుపాయాలను Telegram  అప్లికేషన్ కలిగి ఉంటుంది. ఎప్పటికప్పుడు అనేక కొత్త ఫీచర్లు కూడా ఇది ప్రవేశ పెడుతూ ఉంటుంది.

ఆ క్రమంలో తాజాగా మరికొన్ని ఫీచర్లు వచ్చాయి.  ఇక మీదట ఎవరైనా మీకు మెసేజ్ పెడితే, అవతల వారి ఫోన్ నెంబర్ మీ దగ్గర లేకపోయినప్పటికీ, ఫోన్  నెంబర్ తో సంబంధం లేకుండా సులభంగా కాంటాక్ట్ జత చేసుకునే అవకాశం తాజాగా కల్పించబడింది. అంతేకాదు, యూజర్లను వారి లొకేషన్ ఆధారంగా కూడా మన Telegram అకౌంట్లో జత  చేసుకోవచ్చు.
ఇది వాడడం చాలా సింపుల్. Telegram యాప్  ఓపెన్ చేసి, Contacts అనే విభాగంలోకి వెళ్లి Add People Nearby అనే  ఆప్షన్ ఎంపిక చేసుకుంటే, మీకు దగ్గరలో ఉన్న వివిధ టెలిగ్రామ్ యూజర్లు ఆటోమేటిక్గా వారి లొకేషన్ ఆధారంగా గుర్తించబడి మీకు చూపించబడతారు. వారిని మీ కాంటాక్ట్ లిస్టులో జాయిన్ చేసుకోవచ్చు.
కేవలం వ్యక్తులను మాత్రమే కాదు, మీకు దగ్గరలో ఉన్న టెలిగ్రామ్ గ్రూపులను సులభంగా గుర్తించడం కోసం Groups Nearby అనే  సదుపాయం కూడా లభిస్తుంది. లొకేషన్ ఆధారంగా గ్రూప్ ఛాట్ చేసుకోవడం కోసం ఈ సదుపాయం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వివిధ కాన్ఫరెన్స్‌లు, పండుగలు  వంటి వివిధ సందర్భాలలో సంబంధిత గ్రూప్‌లలోకి వెళ్లి ఛాటింగ్ చేసుకునే వెసులుబాటు ఇది కల్పిస్తుంది.
వాట్సప్‌తో పోలిస్తే  చాలా శక్తివంతమైన ఛాటింగ్ యాప్‌గా Telegram  పరిగణించబడుతుంది. రష్యాకు చెంది జర్మనీలో స్థిరపడిన వ్యక్తులు దీనిని నెలకొల్పడం జరిగింది. మొదట్లో ఇది ఇండియా అప్లికేషన్ అనే అపోహ చాలా కాలం కొనసాగటం,  అనేకమంది వేలంవెర్రిగా దేశభక్తి కొద్దీ దీనిని ఇన్స్టాల్ చేసుకోవడం గుర్తుండే ఉంటుంది.

No comments:

Post a comment

An Awesome Disk Space Analyzer For Low Memory Problem

The biggest problem the users of any device like tablets, laptops, PCs, and phones face these days is the  low memory  problem.  We may find...