Thursday, 27 June 2019

Google మీ ప్రైవసీని కాపాడే కొత్త ఫీచర్ తీసుకువచ్చింది!

Google  సెర్చ్ ఇంజన్లో మీరు ఏదైనా కీవర్డ్  వెదికినప్పుడు, మీరు ఏ పదాల గురించి వెతికారు అన్నది ఆ 
హిస్టరీ మొత్తం చాలాకాలంపాటు గూగుల్ దగ్గర జాగ్రత్తగా ఉంటుంది.

అంతేకాదు, మీరు ప్రపంచంలో ఎక్కడ ఎక్కడ దిగారు అన్న విషయం లొకేషన్ హిస్టరీ రూపంలో గూగుల్ దగ్గర స్టోర్ చేయబడుతుంది. ఈ రెండు రకాల సమాచారాన్ని ఇప్పటి వరకు మనకు అవసరం లేదనుకుంటే శాశ్వతంగా తొలగించుకోవడం గానీ, లేదా  హిస్టరీ స్టోర్ కాకుండా డిజేబుల్ కానీ చేసుకోవచ్చు.
అయితే తాజాగా గూగుల్ ఒక అద్భుతమైన ఫీచర్ ప్రవేశపెట్టింది. ఇక మీదట మీకు వద్దనుకుంటే,  మీ సెర్చ్ హిస్టరీ, లొకేషన్ హిస్టరీలకు సంబంధించిన సమాచారం ప్రతీ మూడు నుండి 18 నెలల మధ్య  మీరు ఎంపిక చేసుకున్న టైంఫ్రేమ్‌లో దానంతట అదే ఆటోమేటిగ్గా డిలీట్ చేయబడే విధంగా సెట్ చేసుకోవచ్చు. అయితే kమూడు నెలలకు ముందు సమాచారం మాత్రం గూగుల్ వివిధ కారణాల వల్ల నిర్వహిస్తుంది.  ఆ సమాచారాన్ని ఆటోమేటిక్ గా తొలగించడానికి సాధ్యపడదు. ముఖ్యంగా రెస్టారెంట్లకు సంబంధించిన సజెషన్లు, మెరుగైన సెర్చ్ రికమండేషన్ లను ఇవ్వడం కోసం ఈ డేటా ఉపయోగించబడుతుంది.
ఈ కొత్త సదుపాయం వినియోగించుకోవాలంటే, మీ  ఫోన్లో గూగుల్ అప్లికేషన్ లోకి ప్రవేశించి Web& App activity అనే విభాగంలో Choose to delete automatically  అనే ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత ఎంత కాలం తర్వాత డేటాను ఆటోమేటిక్ గా తొలగించాలి అన్నది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇకమీదట మీ ప్రమేయం లేకుండానే ఆ డేటా ఆటోమేటిక్గా నిర్దిష్టమైన టైం పీరియడ్ తర్వాత దానంతట అదే తొలగించబడుతుంది.

No comments:

Post a comment