Thursday, 13 June 2019

299 రూపాయల కొత్త ప్లాన్ తీసుకువచ్చిన Vodafone

గత కొంతకాలంగా Vodafone  సంస్థ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం అనేక కొత్త ప్లాన్లు ప్రవేశపెట్టడం
జరిగింది. ఆ క్రమంలో తాజాగా 299 రూపాయల విలువ కలిగిన మరో ప్లాన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ప్లాన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
299 రూపాయలు పెట్టి రీఛార్జి చేసుకున్నవారికి 70 రోజుల పాలిటి అందించబడుతుంది. ప్లాన్ పీరియడ్ మొత్తానికి అపరిమితమైన లోకల్ ఎస్టిడి రోమింగ్ కాల్స్ వినియోగించుకోవచ్చు. 70 రోజులకు కలిపి 1000  ఉచిత ఎస్ఎంఎస్ మెసేజ్ లు అందించబడతాయి. అంతా బానే ఉంది కానీ మొబైల్ డేటా విషయానికొస్తే 70 రోజులకు కలిపి కేవలం 3జీబి మొబైల్ డేటా మాత్రమే అందించబడుతుంది. డేటా వినియోగం ఎక్కువగా ఉండే వారికి ఈ ప్లాన్ ఏమాత్రం సరిపోదు.

ఒకవేళ వాయిస్ కాల్స్ మాత్రమే ఉంటే సరిపోతుంది, ఎప్పుడైనా తప్పనిసరి పరిస్థితుల్లో మొబైల్ డేటా వాడుకోవాలి అనుకునేవారికోసం ఈ ప్లాన్ అనువుగా ఉంటుంది. ఇటీవలి కాలంలో నెట్వర్కు కనెక్టివిటీ  సక్రమంగా లేకపోవడం వలన మామూలు ఫోన్ కాల్ కన్నా అధిక శాతం మంది వాట్స్అప్ కాల్స్ చేసుకోవటానికి అలవాటుపడ్డారు. ఈ నేపథ్యంలో అపరిమితమైన మామూలు వాయిస్ కాల్స్ కన్నా, రోజుకి కనీసం 1, 2GB మొబైల్ రేట్ అందించే ప్లాన్ల వైపు  వినియోగదారులు మొగ్గు చూపిస్తున్న నేపథ్యంలో వోడాఫోన్ సంస్థ అందుబాటులోకి తీసుకు వచ్చిన ఈ కొత్త ప్లాన్ ఎంతవరకు విజయవంతం అవుతుందో వేచి చూడాలి. 
అయితే దేశంలోని అధికశాతం టెలికాం కంపెనీలు వివిధ ప్రీపెయిడ్ ప్లాన్లను  ఎంతమంది వినియోగించుకుంటున్నారు అన్న గణాంకాలతో సంబంధం లేకుండా వివిధ శ్రేణులకు చెందిన వినియోగదారుల అవసరాల కోసం వివిధ ప్లాన్లని  ప్రవేశపెడుతున్నాయి. అందులో భాగంగానే వాళ్ళకున్న సంస్థ కేవలం సాంప్రదాయక వాయిస్ కాల్స్ ఇష్టపడే వారికోసం ఈ కొత్త ప్లాన్ తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

No comments:

Post a comment

An Awesome Disk Space Analyzer For Low Memory Problem

The biggest problem the users of any device like tablets, laptops, PCs, and phones face these days is the  low memory  problem.  We may find...