Wednesday, 22 May 2019

Youtubeలో ఈ మార్పు చోటు చేసుకోబోతోంది!

సహజంగా మనం వివిధ యూట్యూబ్ ఛానళ్లని చూసేటప్పుడు ఆయా
ఛానళ్ల క్రింద  వాటికి ఇప్పటి వరకు ఎంత మంది సబ్ స్కైబర్లు ఉన్నారో ఆ కౌంట్ చూపించబడుతూ ఉంటుంది కదా.


అయితే Youtube  సంస్థ ఆగస్టు 2019 నుండి ఈ కౌంట్  విషయంలో ఒక ముఖ్యమైన మార్పు చేయబోతోంది.  ఇప్పటివరకు పూర్తి వివరంగా subscribers count చూపించబడుతూ ఉండేది. అయితే ఇక మీదట పూర్తి వివరాలు కాకుండా కేవలం abbreviated subscriber count మాత్రమే చూపించబడే విధంగా యూట్యూబ్ ఏర్పాటు చేస్తోంది.

ఈ కొత్త విధానం ప్రకారం 1000 లోపు  సబ్స్క్రైబర్లు ఉన్న యూట్యూబు చానళ్ల విషయంలో ఆ సంఖ్య మొత్తం వివరంగా చూపించబడుతుంది.  ఉదాహరణకు 543 మంది సబ్స్క్రైబర్లు ఉంటే ఆ సంబంధిత యూట్యూబ్ ఛానల్ కింద 543 అని వివరంగా కనిపిస్తుంది.  అయితే ఒకవేళ 1000 కంటే ఎక్కువ మంది subscribers ఉంటే అలాంటి సందర్భంలో మాత్రం రౌండాఫ్ చెయ్యబడి ఆ కౌంట్ మాత్రమే పబ్లిక్ గా చూపించబడుతుంది.  ఉదాహరణకు 4,650 మంది subscribers ఉంటే 4.6K అనీ, 1,33,020 subscribers ఉంటే 133K అనీ ఇలా రౌండాఫ్ చెయ్యబడుతుంది.

No comments:

Post a comment

An Awesome Disk Space Analyzer For Low Memory Problem

The biggest problem the users of any device like tablets, laptops, PCs, and phones face these days is the  low memory  problem.  We may find...