Tuesday, 16 April 2019

TikTok ఇక లభించదు.. తొలగించమని ప్రభుత్వ ఆదేశాలు!

ఇటీవల దేశవ్యాప్తంగా TikTok  వినియోగం బాగా పెరిగిన నేపథ్యంలో అందులో అశ్లీల వీడియోలు పెరిగిపోతున్నాయని దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ యాప్‌ని బ్యాన్ చెయ్యమని మద్రాస్  హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది.  ఈ నేపథ్యంలో ఈ ఆదేశాలను నిలుపుదల చేయమని సుప్రీంకోర్టులో ఫైల్ అయిన పిటీషన్‌  ఈనెల
22వ తారీఖున విచారణకి వస్తోంది. ఇదిలా ఉంటే తమ app storeల నుండి TikTokని  తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నుండి గూగుల్ మరియు యాపిల్ సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి.

వీటి ప్రకారం ఇక మీదట కొత్తగా గూగుల్ ప్లే స్టోర్ నుండి గానీ,  లేదా యాపిల్ యాప్ స్టోర్ నుండి గానీ TikTokని డౌన్లోడ్ చేసుకోవడానికి సాధ్యపడదు.  ఇప్పటికే ఈ అప్లికేషన్ తమ ఫోన్లో కలిగి ఉన్నవారు ఎలాంటి అవాంతరం లేకుండా దాని ఉపయోగించుకోవచ్చు. అయితే కొత్తగా  డౌన్లోడ్ చేసుకోవాలనుకునే వారికి మాత్రం ఇబ్బంది ఏర్పడుతుంది.

2018లో ప్రపంచవ్యాప్తంగా అధికశాతం మంది డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ల జాబితాలో టిక్ టాక్ మొదటి స్థానంలో ఉండడం గమనార్హం. దీన్ని బట్టి ఇది ఎంత పాపులర్ అయిందో అర్థం చేసుకోవచ్చు.  ఒక్క ఇండియానే తీసుకుంటే మొత్తం వినియోగదారుల్లో 39 శాతం మంది మన దేశానికి చెందిన వారు ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే తమ ప్లాట్ ఫాం లో అభ్యంతరకరమైన వీడియోలు పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తున్నామని,  ఇప్పటి వరకు మొత్తం 60 లక్షలు వీడియోలు తొలగించినట్లుగా ఆ సంస్థ ఇటీవల ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఏదేమైనప్పటికీ మరో వారం రోజుల్లో ఇండియాలో టిక్ టాక్ భవితవ్యం తేలబోతోంది.

No comments:

Post a comment

Here Is A Quick Guide For You To Remove Shortcut Virus

The most common problem that many of us get to experience in common all the time is the  shortcut virus . When we find our files, folders tu...