Monday, 8 April 2019

5Gతో పాటు 48 MP కెమెరాతో రాబోతున్న Oppo Reno

ఇకమీదట మనకు ప్రపంచవ్యాప్తంగా అనేక ఫోన్ తయారీ కంపెనీలు 5G phoneలను ప్రవేశపెట్టబోతున్నాయి.


అందులో భాగంగానే తాజాగా Oppo  సంస్థ Oppo Reno పేరుతో ఒక 5G నెట్వర్క్ సపోర్టు కలిగిన ఫోన్‌ని  ఈనెల 24వ తేదీన విడుదల చేయబోతోంది. దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లు వెలుగులోకి వచ్చాయి.  వాటి ప్రకారం ఇందులో 5G సదుపాయంతోపాటు 10x optical zoom పొందుపరచబడి ఉంటుంది. సహజంగా అనేక ఫోన్లు డిజిటల్ జూమ్ అందిస్తూ దాన్ని చాలా గొప్ప విషయంగా పేర్కొంటాయి. అయితే  ఆబ్జెక్ట్ దగ్గరకు మనం స్వయంగా వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఎలాంటి డీటెయిల్స్ మిస్ అవకుండా ఉపయోగపడేది కేవలం ఆప్టికల్ జూమ్ మాత్రమే. ఈ నేపథ్యంలో 10x ఆప్టికల్ జూమ్ ఒక ఫోన్ ద్వారా లభించడం కచ్చితంగా నాణ్యమైన ఫోటోలను ఇష్టపడేవారికి ఉపయోగపడే అంశం.

దాంతోపాటు ఈ ఫోన్ వెనుక భాగంలో మూడు కెమెరాలు లభిస్తాయి.  వీటిలో ప్రధానమైన కెమెరా 48 మెగాపిక్సెల్ Sony IMX586 సెన్సార్ ఉండబోతోంది.  సెకండరీ సెన్సార్ 8 మెగా పిక్సల్ రిజల్యూషన్ కలిగిన వైడ్ యాంగిల్ సెన్సార్ కాగా,  మూడవది 13 megapixel క్వాలిటీ కలిగిన టెలీఫొటో లెన్స్ కావడం గమనార్హం. ఈ మూడవ sensor 10x జూమ్ సెన్సార్‌గా  పనిచేస్తుంది. అలాగే ఫోన్ ముందు భాగంలో 16 megapixel రిజల్యూషన్ కలిగిన పాపప్ కెమెరా లభిస్తుంది.

6.65 అంగుళాల AMOLED  డిస్ప్లేతో Full HD+ రిజల్యూషన్  కలిగి ఉండే ఈ ఫోన్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ లభించే అవకాశాలు ఉన్నాయి. 8 GB RAM,  256 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఈ ఫోన్ లో ఉంటుంది. Android 9.0 Pie ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే Color OS 6.0 ఈ Oppo Reno ఫోన్లో  లభించవచ్చు.

No comments:

Post a comment