Wednesday, 27 March 2019

వాట్సాప్ మరో సూపర్ ఫీచర్ తీసుకొస్తోంది!


                        వాట్సాప్ మరో సూపర్ ఫీచర్ తీసుకొస్తోంది!

       

Whatsappలో  అతి త్వరలో మనకు మరో కొత్త సదుపాయం రాబోతోంది. వాట్సప్  వినియోగదారులను బాగా ఇబ్బంది పెడుతున్న సమస్య ఫేక్ న్యూస్.


ఏది నిజమైన సమాచారమో, ఏది నకిలీ సమాచారమో నిర్ణయించుకోలేక వాట్సప్ వినియోగదారులు ఇబ్బంది పడుతుంటారు.  దాంతో అబద్ధాలను నిజమని నమ్మి, వాటిని తమకు తెలిసిన వారికి కూడా షేర్ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో వాట్సాప్ లో reverse image search రాబోతున్నట్లు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. అదేవిధంగా వాట్సప్  ప్రత్యేకంగా బయట బ్రౌజర్‌‌కి వెళ్లాల్సిన పని లేకుండా, నేరుగా అప్లికేషన్ లోనే వివిధ వెబ్ సైటు లింకులు ఓపెన్ అయ్యేవిధంగా in-app browser సదుపాయాన్ని ప్రవేశపెట్టబోతోంది. 


ఈ సదుపాయం వల్ల అనేక రకాల ప్రయోజనాలు లభిస్తాయి.  ఈ ప్రత్యేకమైన బ్రౌజర్‌లో ఒక సమాచారం నిజమా లేదా అన్నది తెలుసుకోగలిగే విధంగా కొన్ని ఫ్యాక్ట్ ఛెకింగ్ టూల్స్  పొందుపరచబడతాయి. అలాగే మీరు క్లిక్ చేసే లింకులో ఏదైనా మాల్వేర్ ఉంటే ఆ విషయం కూడా ఈ బ్రౌజర్ గుర్తించి, ఆయా వెబ్ సైట్ లను ఓపెన్ చేయకుండా మిమ్మలను అడ్డుకుంటుంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం లో ఉండే WebView  అనే సదుపాయాన్ని ఆసరాగా చేసుకుని డెవలప్ చేయబడే ఈ in-app browser ఖచ్చితంగా కొంతవరకు ఫేక్ న్యూస్ కి అడ్డుకట్ట వేస్తుంది అనడంలో సందేహమే లేదు.
ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ సదుపాయం,  అతి త్వరలో Whatsapp beta వాడుతున్న వినియోగదారులకు,  ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అందరు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

No comments:

Post a comment