Thursday, 28 March 2019

True Caller అనేక కొత్త సదుపాయాలు తీసుకొస్తోంది!


ఏవైనా కొత్త నెంబర్ల నుండి ఫోన్ కాల్స్  వచ్చినప్పుడు అవతలి వ్యక్తి పేరు స్క్రీన్ మీద చూపించడం కోసం చాలా మంది తమ ఫోన్లో TrueCaller అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటారు కదా!
ఇప్పటివరకు కేవలం కాలర్ ఐడి సేవలు,  కొద్ది మొత్తంలో చెల్లింపులకి సంబంధించిన సేవలు అందించిన TrueCaller  సంస్థ తాజాగా TrueCaller Pay ద్వారా విస్తృతమైన ఇతర సదుపాయాలు అందించటానికి ప్రయత్నాలు చేస్తోంది.  వినియోగదారులకు అందుబాటులో ఉన్న 300కుపైగా మొబైల్ అప్లికేషన్లు నేరుగా TrueCaller క్రెడెన్షియల్స్‌ని  ఆసరాగా చేసుకొని వినియోగదారులను వెరిఫికేషన్ చేసే విధంగా ఈ సంస్థ వెసులుబాటు కల్పిస్తోంది. ఇది ఎలా పనిచేస్తుందంటే,  ఇప్పటికే మీ ఫోన్లో ట్రూ కాలర్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయబడి ఉందనుకుందాం.
మీరు  ఏదైనా ఇతర మొబైల్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినప్పుడు,  మరి పని చేయాలంటే మొబైల్ నెంబర్ వెరిఫై చేయబడాలి అనుకుంటే,  ప్రత్యేకంగా మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి పనిలేకుండా అప్పటికి మీ ఫోన్ లో ఉన్న ట్రూ కాలర్ యాప్ ద్వారా మీ నెంబర్  క్షణాల్లో వాలిడేట్ చేయబడుతుంది. అంతేకాదు ఆయా అప్లికేషన్లకు TrueCaller Pay సదుపాయం ద్వారా వినియోగదారులు కావలసిన చెల్లింపులు చేసే విధంగా ట్రూకాలర్ అవకాశం కల్పిస్తుంది.
వీటితోపాటు క్రెడిట్ కార్డ్,  కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు వంటి వాటిని మర్చిపోకుండా సకాలంలో చెల్లించడం కోసం ట్రూ కాలర్ మనకు స్మార్ట్ నోటిఫికేషన్ సదుపాయాలు కూడా అందిస్తుంది. వీటితో పాటు అనేక రకాల ఫైనాన్షియల్ సేవలను కూడా ఇకమీదట ఈ అప్లికేషన్ ద్వారా పొందబోతున్నాం. అర్హత ఉన్న వినియోగదారులకు స్వల్పకాలిక రుణాలు మంజూరు చేసే ఆలోచనలో కూడా ఈ సంస్థ ఉంది. మొదటి దశలో దేశవ్యాప్తంగా 22 నగరాల్లో 50 వేల రూపాయలు మొత్తం ఐదు లక్షల రూపాయల వరకు విలువ కలిగిన రుణాలను TrueCaller  మంజూరు చేయబోతోంది.

No comments:

Post a comment

An Amazing Screenshot Tool That All Windows Users Must Try

Every one of us might be very much in need of a screenshot taking a tool. It allows us to capture the required pages or parts of pages fro...