Sunday, 24 March 2019

వినూత్నమైన డిజైన్‌తో Samsung Galaxy A90 రాబోతోంది!




సుదీర్ఘకాలంగా సంస్థ డిజైనింగ్ విషయంలో అనేక ప్రయోగాలు చేస్తూనే ఉంది.  అందులో భాగంగా ఇటీవల మార్కెట్లో విడుదలైన శాంసంగ్ గెలాక్సీ S10 విషయంలో కెమెరా కోసం స్క్రీన్ లో hole వేసిన  ఈ సంస్థ తాజాగా మరో భిన్నమైన డిజైన్‌తో Samsung Galaxy A90 ఫోన్ విడుదల చేయబోతోంది.
దీనికి సంబంధించిన డిజైన్ యాదృచ్ఛికంగా లీక్ అయింది.  ఇప్పటివరకు శాంసంగ్ విడుదల చేసిన ఏ ఇతర ఫోన్ లోనూ లేని విధంగా దాదాపు పూర్తి స్థాయి స్క్రీన్ ఏరియా లభించే విధంగా ఇది రూపొందించబడింది.  ఇటీవలి కాలంలో అనేక ఫోన్ తయారీ కంపెనీలు స్క్రీన్ పై భాగంలో కెమెరా కోసం notchని అమర్చుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇలా ప్రత్యేకంగా notch కూడా  లేకుండా ఈ ఫోన్ రూపొందించబడుతోంది.
అత్యంత సహజసిద్ధంగా రంగులు కనిపించే విధంగా Super AMOLED  డిస్ప్లేతో సాంసంగ్ గెలాక్సీ A90 ఫోన్ విడుదల కాబోతోంది. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికొస్తే,  ఇప్పటివరకు శ్యాంసంగ్ అనుసరిస్తున్న విధానాలకు విధంగా పాపప్ సెల్ఫీ కెమెరా రూపంలో ఈ ఫోన్ కెమెరా ఉంటుంది.  అయితే ఈ ఫోన్ కి సంబంధించిన మిగతా స్పెసిఫికేషన్స్ వెల్లడి కాకపోయినప్పటికీ, ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్,  6 లేదా 8 GB మొత్తంలో రామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇది 6.41 అంగుళాల స్క్రీన్ పరిమాణం కలిగి ఉంటుందని తెలుస్తోంది. బ్యాటరీ విషయానికొస్తే 4000ఎమ్ఏహెచ్ కెపాసిటీ కలిగిన బ్యాటరీ దీంట్లో ఉండొచ్చు. ఏప్రిల్ 10వ తేదీన ఈ సామ్సంగ్ గెలాక్సీ ఏ 90 ఫోన్ కి సంబంధించిన  రిలీజ్ ఈవెంట్ జరుగుతుందని తెలుస్తోంది.

No comments:

Post a comment