Saturday, 23 March 2019

గేమ్ ఆడే వారికి క్షమాపణ చెప్పిన PUBG


PUBG  గేమ్ ని గంటల తరబడి ఆడుతూ,  దేశ వ్యాప్తంగా అనేక మంది యువత ఇబ్బందులు ఫాలో అవుతున్న నేపథ్యంలో తాజాగా ఆ గేమ్ ఆడే వారికి ఉన్నపళంగా ఫోన్ స్క్రీన్ మీద ఒక మెసేజ్ కనిపించడం మొదలుపెట్టింది.
You’ve played the game for six hours today. Please come back at 2019-03-23 05.30.00” అనే  మెసేజ్ అనేకమంది గేమ్ ఆడే వారికి వారు గేమ్ ఆడుతుండగా స్క్రీన్ మీద కనిపించడం మొదలుపెట్టింది. ఆందోళన చెందిన గేమర్లు  తమకు ఎదురైన సమస్య గురించి ట్విట్టర్ లో పోస్ట్ చేయడం మొదలుపెట్టారు.

దీని గురించి PUBG Mobile India  ప్రతిస్పందిస్తూ, గేమర్లకి కలిగిన అసౌకర్యానికి  చింతిస్తున్నట్లు, హెల్తీ గేమింగ్ సిస్టమ్‌లో చోటు చేసుకున్న ఒక చిన్న సమస్య వలన ఇలాంటి మెసేజ్ స్క్రీన్ మీద చూపించబడినట్లుగా  వెల్లడించింది. ఆ సమస్య పరిష్కరించినట్లు, ఇకపై ఎలాంటి అవాంతరం లేకుండా PUBG గేమ్ ఆడే వారు నిరంతరాయంగా గేమ్ ఆడొచ్చని ఒక ప్రకటన విడుదల చేసింది.

అయితే చాలా మంది ఫోన్ స్క్రీన్ మీద చూపించబడిన ఈ మెసేజ్,  అనేక అనుమానాలకు తావిస్తోంది. తాజాగా PUBG గేమ్‌ని దేశంలో నిషేధించమని కేంద్ర బాలల హక్కుల కమిషన్‌లో  పిటిషన్ దాఖలైన నేపధ్యంలో, ఆ కమిషన్ తగిన విధంగా చర్యలు తీసుకోమని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖను కూడా కోరడం జరిగింది. ఆ మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించింది. ఈ పరిణామాలను గమనిస్తే కనుక అతి త్వరలో Google Play Store, Apple App Storeల నుండి  ఇండియాలో ఈ గేమ్ తొలగించబడే అవకాశాలు ఉన్నాయి.
ఇండియా లో జరుగుతున్న ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని, PUBG  సంస్థ ముందు జాగ్రత్త చర్యగా ఇలా హెల్దీ గేమింగ్ సిస్టమ్ పేరిట తాము దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వానికి  వెల్లడించడానికి ప్రయత్నిస్తున్నట్లు దీన్ని బట్టి అర్థమవుతోంది. ఏదేమైనా ఇండియాలో PUBG గేమ్‌కి పరోక్షంగా కష్టాలు మొదలయ్యాయనే చెప్పుకోవాలి.

No comments:

Post a comment

A Simple Trick For Converting Any Image Into PDF In Your PC

The process of converting  images  to  PDF  files could be a difficult thing and would include a lot of efforts as well if you don’t know ...